పగలు, ప్రతీకారాలు మర్చిపోయి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనంద క్షణాలతో గడిపే పండగ హోళి. వరసైన వారిపై చల్లి ఆనందాలను పంచుకునే అరుదైన క్షణం ఇది.
అలాంటి హోలీ సంబురాల్లో దేశమంతా మునిగితేలుతున్న క్షణంలో.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
పుట్టెడు దుఃఖంలో మునిగిన తెలంగాణలో రంగులతో హోలీ ఆడే సమయం దొరకడం లేదు. ఇది దొరల పాలనలో దగాపడ్డ తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాల్సిన సమయం.. ఎనీవే హ్యాపీ హోళీ అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి మద్దతుగా కొంతమంది రీట్వీట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.