టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంలో సీఎం కుటుంబంపై ఆరోపణలు వస్తున్నందున కేసును సీబీఐకి ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఈ కేసులో దోషులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించాలని అన్నారు.
మార్చి 21 మంగళవారం పేపర్ లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ లో యువజన సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగుల గోస పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ పాల్గొన్నారు. ప్రశ్నించే చానల్స్ ను బ్యాన్ చేస్తమని బీఆర్ఎస్ మంత్రులు బెదిరిస్తున్నారు.
ఇలాంటి అన్ని సమస్యలపై కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు ప్రవీణ్ కుమార్. ప్రత్యేక కార్యాచరణతో అందరం ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి.. ప్రత్యేక విమానాల్లో పోయి కవితను కాపాడుకునేంత దమ్ము వారికి ఉందని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లు సిట్ వింటుంది. పేపర్ లీక్ కేసును సిట్ కాదు సీబీఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కొందిరి చేతుల్లోబలైందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.