బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండని, వెనుక నేనున్నాను.. అంటూ యువతకు అభయమివ్వడం మంచి పద్ధతి కాదన్నారు.
బైరి నరేష్ అయినా, చినజీయర్ స్వామి అయినా మత విశ్వాసాలను అవమానిస్తే అది ముమ్మాటికీ తప్పేనని ఆర్ఎస్పీ అన్నారు. అలాంటి వారిని చట్ట ప్రకారం శిక్షించాలి కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమనడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో యువతకు బండి సంజయ్ అభయ హస్తమిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అయప్ప స్వామి పై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేవలం సెక్షన్ల కింద కేసులు మాత్రమే పెట్టారని, హిందూ దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తరిమి కొట్టాలని ఆయన అన్నారు. దీంతో బండి వ్యాఖ్యలపై ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు.