సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని…మందిరం నిర్మాణానికి అందరూ కలిసి రావాలని కోరారు ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన భగవత్. కోర్టు ఆదేశాల ప్రకారమే ట్రస్ట్ ఏర్పాటు, మందిర నిర్మాణం జరుగుతాయని, దశబ్ధాల సమస్య పరిష్కారం అయిందని పేర్కొన్నారు.
హిందూ-ముస్లింలు అంతా భారత నాగరికతలో భాగమేనన్నారు మోహన్ భగవత్.
మందిర నిర్మాణమే మా లక్ష్యమని, సంఘ్ ఎప్పుడూ ఆందోళనలు నిర్వహిస్తుందని తప్పుడు ప్రచారం చేశారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇక వివాదం సమసిపోయిందని భావిస్తున్నామని… మసీదు నిర్మాణానికి భూమి ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది సుప్రీం, కేంద్రం చూసుకుంటుందని స్పష్టం చేశారు.