ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత మాతకు అబద్దం చెబుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో డిటెన్షన్ సెంటర్లను పెట్టమని..ఎన్.ఆర్.సి ని దేశవ్యాప్తంగా అమలు చేయమని ఆరెస్సెస్ కు చెందిన నరేంద్రమోదీ భారత మాతకు అబద్ధం చెప్పారంటూ సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అస్సాంలో డిటెన్షన్ సెంటర్ గురించి మీడియాలో వచ్చిన వార్తలను, ఆదివారం రామ్ లీలా మైదాన్ లో ప్రధాని చేసిన ప్రసంగాన్ని పక్క పక్కన పెట్టి రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి జూట్ జూట్ జూట్ అంటూ యాష్ ట్యాగ్ పెట్టారు.
”కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, అర్బన్ నక్సలైట్లు ఎన్.ఆర్.సి పై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు…ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపుతారని అబద్దాలు చెబుతున్నారు..దేశంలో ఎవరిని డిటెన్షన్ సెంటర్లకు పంపం..దేశంలోని ముస్లింలకు ఎన్.ఆర్.సి అమలు కాదు…ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ప్రధాని అన్నారు.
పౌర జాబితాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రశ్నిస్తున్నాయి.