విజయవాడ :పల్నాటి రాజకీయాలు పౌరుషాలతో రగిలిపోతున్నాయి. మాజీ సభాపతి కోడెల కుటుంబాన్ని ప్రత్యర్ధులు వదిలేలా లేరు. కోడెల శివప్రసాదరావు కుటుంబానికి ఆర్టీఏ ఆధికారుల షాకిచ్చారు. కోడెల కుమారుడు కోడెల శివరామకృష్ణకు చెందిన గౌతం ఆటోమోటివ్స్ లైసెన్సునే కాకుండా డీలర్ షిప్ కూడా రద్దు చేశారు. డీలర్‌షిప్ కూడా రద్దు చేయడంతో గౌతం ఆటోమోటివ్స్‌కి వాహనాల సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే తన కుమారుడి షోరూమ్ సీజ్ చేయడం అక్రమమంటూ కోర్టుకెక్కిన కోడెల.. ఇప్పుడు ఆయన కుమారుడు శివరామకృష్ణ డీలర్‌షిప్ రద్దుపై ఎలా రియాక్టు కానున్నారో చూడాలి. ఆర్టీఏ చట్టాలను ఉల్లంఘిస్తూ 576 వాహనాలను అక్రమంగా కొనుగోలుదారులకు అమ్మారంటూ విచారణలో తేల్చారు. రూల్ నెంబర్ 84, ఏపీఎంవీ రూల్స్ 1989 అనుసరించి కోడెల శివరామకృష్ణకు చెందిన గౌతం ఆటోమోటివ్ డీలర్‌షిప్ రద్దు చేస్తున్నట్టు నోటీస్ జారీ చేసిన ఆర్టీఏ అధికారులు గౌతం ఆటోమోటివ్స్ అక్రమాలను హీరో మోటర్స్‌కు కూడా సాక్ష్యాధారాలతో తెలియజేశారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » కోడెల కుటుంబానికి ఆర్టీఏ షాక్