గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెనాలి నుంచి ప్రయాణీకులతో భట్టిప్రోలు వెళ్తుండగా ..పెదరావూరు వద్ద బస్సు కాల్వ అంచులోకి ఒరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. వర్షాల కారణంగా రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పింది. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు లాగారు అధికారులు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.