ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం - Tolivelugu

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

ఆర్టీసీ బస్సులను ప్రైవేటు డ్రైవర్లు నడపటం వల్ల రోజుకో ప్రమాదం జరుగుతోంది. తాజాగా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి నది ప్రవాహాన్ని అంచనా వేయటంలో డ్రైవర్‌ తప్పిదంతో… నది ప్రవాహానికి బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ప్రయాణికులు, చుట్టుపక్కల వారు చాకచక్యంగా వ్యవహరించటంతో… పెనుప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో… యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడుపుతుండటంతో, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ప్రయాణికుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp