తెలంగాణ వ్యాప్తంగా వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఓ ఆర్టీసీ బస్సు వాగు దాటుతూ పక్కకు వెళ్లిపోయింది.
రోడ్డు అంచుకు వెళ్లి బస్సు ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అందులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు గమనించి వారందరినీ కాపాడారు. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు ప్రయాణికులు.