గమ్యస్థానం చేరుకునేందుకు బస్సులెక్కుతాం. అంతేకానీ.. టికెట్ తీసుకొని మరీ ఎక్కిన బస్సును దిగి తోయాల్సి వస్తే… ? కానీ తెలంగాణలో ప్రజలకు తప్పటం లేదు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం పట్టింపులకు పోయి తాత్కాలిక డ్రైవర్లను ఏర్పాటు చేసి, మేము బస్సులు నడుపుతున్నాం అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. కానీ సరైన అవగాహన లేక, మన పాతపడిపోయిన ఆర్టీసీ బస్సులను నడపలేక డ్రైవర్లు మధ్యలోనే చేతులెత్తేస్తున్నారు. జనం చెయ్యి ఎత్తితే ఆగే ఆర్టీసీ బస్సు… ఇప్పుడు ఎందుకు, ఎప్పుడు ఆగుతుందో తెలియటం లేదు.
జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్లాల్సిన బస్సు గంగధార క్రాస్ రోడ్ వద్ద ఆగిపోయింది. దీంతో చేసేది లేక ప్రయాణికులు బస్సు దిగి తొయ్యటం మొదలుపెట్టారు. అయినా స్టార్ట్ అవ్వకపోవటంతో మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటూ ఆందోళనకు దిగారు.