మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో దారుణం జరిగింది. బీరుసీసా పేలి ఆర్టీసీ డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం చోటుచేసుకొన్నది.
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆర్టీసీ డ్రైవర్ భక్తులను తాడ్వాయికి తరలించిన తర్వాత బస్సును బస్టాండ్ లో ఆపాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఓ బెల్ట్ షాప్ లో ఓ బీరు కొనుగోలు చేశాడు ఆ డ్రైవర్.
కొన్న బీరును చేతిలో పట్టుకోకుండా సొక్కా లోపల పెట్టుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా ఆ బీర్ బాటిల్ పేలింది. ఈ ప్రమాదంలో సదరు డ్రైవర్ పొట్ట భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.
గమనించిన డ్రైవర్లు వెంటనే అతడిని 108 వాహనంలో హైదరాబాద్ కు తరలించారు. అయితే.. ప్రమాదంలో కడుపులోని పేగులు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు సమాచారం.