ఎన్నో ప్రాజెక్టులతో… ఎంతో ఎత్తుకు ఎదిగిన మెఘా కృష్ణారెడ్డి, కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టిలో పడేందుకు ఆర్టీసీయే కారణమా…? ఆర్టీసీ బస్సుల అంశమే మెఘా మెడకు చుట్టుకుందా…? తీగలాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోందా…? అంటే అవుననే అంటున్నాయి దర్యాప్తు సంస్థలు.
వేల కోట్ల ప్రాజెక్ట్‌లు కట్టినా, ఏనాడు ఇంత పెద్ద ఎత్తున సోదాలు జరగలేదు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలతో సాన్నిహిత్యం ఉన్నా… కంపెనీల మీద కంపెనీలు పెడుతూ… సంపద కాలంతో పరుగులు తీసినా దర్యాప్తు సంస్థలు ఇంటికి రాలేదు. కానీ ఆర్టీసీ అంశం ఇప్పుడు మెఘాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన అక్రమాల చిట్టాతో రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.
అవును… ఆర్టీసీలోకి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల అంశమే… సైలెంట్‌గా మెఘాకొంప ముంచుతోంది. రెండు కోట్ల విలువ చేసే ఎలక్ట్రిక్ బస్సులను కోటికే వచ్చేలా చేసుకొని 40కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు గోల్‌మాల్ అంశంతోనే ఐటీసోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… ఈ కొత్త బస్సులను నేరుగా మెఘా పేరుతో కాకుండా… మియాపూర్ భూముల కుంభకోణంలో దొరికిపోయిన గోల్డ్‌స్టోన్ కంపెనీకి సంబంధించిన ట్రీనీటీ ఇన్‌ఫ్రావెంచర్స్ కంపెనీని టేక్‌ఓవర్ చేశారు. దాదాపు 650కోట్లకుపైగా ఇందులో పెట్టుబడులు పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. ఆ తర్వాతే కంపెనీ పేరును ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌గా పేరు మార్చారని, అదే పేరుతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఆ తర్వాత గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఆ కంపెనీలో మైనర్ వాటాదారుడు కాగా… మెఘా ఆ కంపెనీని సొంతం చేసుకుంది.
అయితే, ప్రస్తుతం కేవలం 40బస్సులే వచ్చినా… ఒప్పందం ప్రకారం 334 బస్సులను సప్లై చేయాల్సి ఉంది. అందులో 309 గ్రేటర్ హైదరాబాద్‌కు, మిగతావి గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌కు వినియోగించాలన్నది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. అయితే ప్రస్తుత సోదాల్లో మెఘా కంపెనీ ఎలా ట్రీనీటీ ఇన్‌ఫ్రావెంచర్స్‌ను ఎలా కొనుగోలు చేసింది అనే అన్నిరకాల డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మెఘాలో జీవితకాల డైరెక్టర్‌గా ఉన్నపీపీరెడ్డితో పాటు బంధువులంతా ట్రీనీటీ బోర్డులోకి వచ్చేశారు. అయితే, ఇందులో 38శాతం ఇంకా గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు భాగస్వామ్యం ఉందని…. ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.