ఆర్థిక ఇబ్బందులతో ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని నెలలుగా జీతాలు లేక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ మండలం డబిల్ పురకు చెందిన షేక్ బాబా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందులను తాళలేక విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. షేక్ బాబా రాణిగంజ్ డిపో లో మెకానిక్ గా పనిచేస్తుండేవాడు. ప్రస్తుతం బాబా రష్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.