సమ్మెతో జీతాలు లేక, చేసిన పనికి జీతం రాక ఇబ్బందిపడుతోన్న ఆర్టీసీ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నెల నెల ఇంటికి అద్దె చెల్లించని కార్మికులు కొందరైతే, లోన్ పెట్టుకొని ఇళ్లు కట్టుకుంటే… నెల నెల ఈఎంఐ పెట్టుకొని ఉంటున్న వారు మరి కొందరు. ప్రతి నెల జీతం వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు లేని వారికి ఇప్పుడు ఇల్లు గడవటమే గగనమైపోయింది.
జీతం లేక రెండు నెలలు దాటిపోతున్నా… ప్రభుత్వం కనికరించటం లేదు. దాంతో మీరు బకాయిలు ఎప్పుడు కడతారు, లేదంటే మీ మీద కేసులు అవుతాయంటూ కార్మికులకు ఫోన్లు వస్తున్నాయి. అయితే… వారికి కార్మికుడు ఇచ్చిన సమాధానం ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా ఉంది.
కేసీఆర్ నాకు జీతం ఇవ్వలేదు… నేను డబ్బులు కట్టలేను కోర్ట్ లో కేసు వేసుకుంటావా వేసుకో..నాకు భయం లేదు. కేసీఆర్ కూడా డబ్బులు నా దగ్గర లేవు..డబ్బులు లేనప్పుడు కోర్ట్ లు ఏమి చెయ్యగలవు, కోర్టులు కొడుతాయా అని చెప్పాడు. నేను కూడా అదే చెప్తున్నా నా దగ్గర డబ్బులు లేవు. నా జీవితం రోడ్డున పడింది. మీరు ఏమి చేసిన నేను సిద్ధం అంటూ చెప్పిన మాటలకు బ్యాంకు అధికారులు అవాక్ అవుతున్నారు.