ఆర్టీసీ సమ్మె, కార్మికుల తొలగింపు… కార్మికుల డిమాండ్ల అంశాలపై అఖిలపక్షం ఆద్వర్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు గవర్నర్‌ను కలవబోతున్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న రౌండ్ సమావేశం అనంతరం దీనిపై ప్రకటన చేయబోతున్నాయి కార్మిక సంఘాలు. గవర్నర్ తమిళసైని కలిసి… తమ డిమాండ్లు, ప్రభుత్వ నిర్భందకాండ తీరుపై ఫిర్యాదు చేయబోతున్నాయి. రాజ్యంగ పరిరక్షులుగా… తమపై ప్రభుత్వం చేస్తోన్న కక్షసాధింపుపై జోక్యం చేసుకోవాలని కోరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరగా… శుక్రవారం గవర్నర్‌ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, గత గవర్నర్ కన్నా… యాక్టివ్‌గా ఉన్న గవర్నర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ ఆర్టీసీకి బలంగా మద్దతిస్తోన్న నేపథ్యంలో, గవర్నర్ ఏం చేయనున్నారు… రవాణా శాఖ, ఆర్టీసీ యాజమాన్యాన్ని పిలిపించుకొని మాట్లాడతారా…? కార్మికులపై వేసిన సస్పెన్షన్‌పై ఏవిధంగా స్పందిస్తారు, గతంలో గవర్నర్ సొంత రాష్ట్రం తమిళనాడులో జరిగిన ఆర్టీసీ సమ్మెలు, ప్రభుత్వాల తీరుపై నాడు తమిళసై స్పందించిన తీరు సహా అన్ని అంశాలు ఇప్పుడు కీలకం కాబోతున్నాయి.