ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు రాస్తూ, అసత్య ఆరోపణలు చేస్తున్న టి న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. కరీంనగర్ టౌన్ లో నమస్తే తెలంగాణ, టి న్యూస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పత్రికలను తగలబెట్టారు.
జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందులతో రోడ్డు న పడి, బలవన్మరణాలకు పాల్పపడుతుంటే తప్పుడు రాతలు రాస్తూ ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే మీకు కనిపించట్లేదా అంటూ ప్రభుత్వానికి, నమస్తే తెలంగాణ పత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా గురించి రాయకపోయిన పర్వాలేదు కానీ తప్పుడు రాతలు రాయొద్దు అంటూ హెచ్చరించారు.