అనుకున్నది ఒక్కటి… అయినది ఒక్కటి… బొల్తా కొట్టింది లే…. బుల్ బుల్ పిట్ట అనే పాట గుర్తొస్తుంది. అవును సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల అంశంలో వేసిన అడుగులు, వ్యవహరించిన తీరు ఎవరికైనా అదే అనిపిస్తుంది. కార్మికులతో కనీసం చర్చించకుండా… చర్చల్లేవ్, సెల్ఫ్ డిస్మిస్ అంటూ రెచ్చగెట్టే ప్రకటనలు చేశారు. మందుల్లేక చచ్చిపోతున్నాం సార్ అని ప్రాదేయపడ్డా మానవత్వం కూడా లేకుండా… కనికరం కూడా చూపకండా ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకున్నారు.
ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితులు దొరికేశారు
మీ ఉద్యోగాల్లేవ్ అనే మాట ఏ కార్మికుడికైనా గుండెలు పగిలేలా తగులుతుంది. జీతం ఇవ్వకుండా… నీ ఉద్యోగం పోయింది అంటే ఎవరికైనా జీర్ణించుకోవటం కష్టం. అందుకే గుండె పగిలి చనిపోయిన కార్మికులు కొందరైతే, భవిష్యత్ మీద భయంతో ఆత్మహత్య చేసుకున్న కార్మికులు మరికొందరు. 52 రోజుల సమ్మెలో టీఆర్ఎస్ నేతల ప్రవర్తన, కేసీఆర్ మాటలు… ఆర్టీసీ యాజమాన్యం తీరు సామాన్య ప్రజలు కూడా చీదరించుకునేలా చేసింది.
ప్రియాంక రెడ్డి హత్య పాపం వారిదేనా…?
మున్సిపల్ ఎన్నికల కోసమో, కేంద్రం ఎంటరైతే ఇబ్బంది తప్పదనో… 2 లక్షల కుటుంబాల ఆర్తనాదాలు వినో సీఎం కేసీఆర్ దిగి వచ్చారు. ఉద్యోగాల్లో చేరండి… జీతాల సమస్య తీరుస్తానంటూ ప్రకటించారు. చనిపోయిన కార్మికులకు సహాయంపై మాట్లాడకున్నా… కారుణ్య నియామకాల ద్వారా వారి కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని తెలిపారు.
పోసానితో గొడవపడ్డ కొత్త డైరెక్టర్
దీంతో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరిపోయారు. అయితే… ఇదే అదునుగా తమకు అలవాటైన పద్దతుల్లో పాల ప్యాకెట్లు, బాణాసంచాతో డిపోల వద్దకు చేరుకున్న టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నించారు. సార్ దయాగుణంతో కరుణించారు అంటూ డిపోల వద్దకు వాలిపోయారు.
కేసీఆర్ యూటర్న్ కారణం వారేనా…?
టీఆర్‌ఎస్ నేతలను చూసిన కార్మికులు… ఆగ్రహాంతో ఊగిపోతూ ఏం ముఖం పెట్టుకొని మా దగ్గరకు వచ్చారు, మేం గాయాల పాలై, పస్తులున్నప్పుడు ఎక్కడున్నారు, మా కార్మికుల చావులతో సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపించారు. టీఆరెఎస్ నేతలపై తిరగబడుతూ… డిపోల దగ్గర నుండి పంపించి వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉండగా… ఉద్యోగంలో చేరిన సంతోషం కన్నా ఈ 52 రోజుల సమ్మె, మేం అనుభవించిన బాధ, మా కార్మికుల చావులు… లాఠీ దెబ్బలు జీవితాంతం గుర్తుంటాయంటున్నారు కార్మికులు.