ముంచుకొస్తున్నడెడ్‌లైన్... టెన్షన్‌లో సీఎం - Tolivelugu

ముంచుకొస్తున్నడెడ్‌లైన్… టెన్షన్‌లో సీఎం

ఈ నెల 6వ తేదీ అర్ధాత్రి లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలంటూ ముఖ్యమంత్రి విధించిన గడువు దగ్గర పడేకొద్ది కార్మికులు కన్నా సీఎంకు, ప్రభుత్వానికి టెన్షన్‌ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి బెదిరించే ధోరణిలో చెప్పినా… ఎవరూ చేరకపోతే ప్రభుత్వం అన్న, సీఎం కేసీఅర్ అన్నా ప్రజలలో భయం లేదు అనే మెసేజ్ పోతుంది. అంతే కాదు భవిష్యత్ లో ఇతర ఉద్యోగ సంఘాలు ప్రజలు కుడా ఇదే ధోరణిలో తనను కాని తన ప్రభుత్వన్ని కానీ లెక్కచేయకాపోవచ్చు. దీంతో పాలన మీద అజమాయిషీ లేకుండా పోతుంది అన్న భయం వెంటాడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అందుకే తన స్వంత పత్రిక నమస్తే తెలంగాణ, ఛానెల్ టీ న్యూస్ లలో పదే పదే ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులు ఉపయోగించుకుంటున్నారు అని, పెద్ద ఎత్తున కార్మికులు చేరుతున్నారు అంటూ బ్రేకింగ్ వేసి రిపోర్టర్ లతో ఫోన్ ఇన్ పెట్టించి రెండు రోజులుగా హడావిడి చేస్తున్నా ఇప్పటివరకు 50 మందికుడా చేరలేదు. అంటే కార్మికులు ఎంత గట్టిగా ఉన్నారో అర్థం అవుతుంది. డ్యూటీలో చేరుతున్న వారిలో కుడా కొందరు గతంలో సస్పెండ్ కు గురైన వారు అని తెలుస్తుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం ఎవరూ డ్యూటీ లకు వెళ్ళడం లేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటోంది. ఇది ఇలాఉంటే డీజీపీ నుండి ఇతర పోలీస్ అధికారులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. డ్యూటీలో చేరేవారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని, ఎవరన్నా వారికి ఆటంకం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాదు ఎవరు ఏ డిపోలో పనిచేస్తున్న రాష్ట్రంలో ఏ డిపోలో నైనా రిపోర్ట్ చేయవచ్చు అంటూ ప్రకటనలను ఇస్తున్నారు. ఇంత హడావిడి చేసినా చేరుతున్నవారి సంఖ్య మాత్రం చాల తక్కువగా ఉంది.

విధులలో చేరినవారిలో కొందరు మళ్లీ సమ్మె బాట పడుతున్నారని తెలుస్తుంది. సమ్మేకాలంలో చనిపోయిన వారు గుర్తుకొచ్చి మాకు డ్యూటీ చేయాలని అనిపించలేదు అని చెప్తున్నారు. ఈనెల 7వ తారీఖున కోర్టు వాయిదా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈలోపే సమ్మెను ఖతం చేయాలని చూస్తుందని జేఏసీ మండిపడుతోంది. కార్మికులపై బెదిరింపులకు పాల్పడుతూ ఆర్టీసీ రహిత తెలంగాణ చేస్తా అంటూ ప్రభుత్వమే బ్లాక్ మెయిల్ కి పాల్పడటం దురదృష్టకరం అంటున్నారు. హైకోర్టు ఈవిషయంలో ఏమి చేయలేదు అంటూనే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు కు వెళతాం అంటూ బెదిరించడం ఏమిటని జేఏసీ నాయకులు అంటున్నారు. దీనిని బట్టి కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుంది అని ప్రభుత్వం భయపడుతుంది అంటున్నారు.

అందుకే కోర్టు వాయిదా కన్నా ముందే సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేస్తుంది అని మండి పడుతున్నారు. ముఖ్యమంత్రి ఎన్ని జిమ్మికులు చేసినా ఎంత బెదిరింపు ధోరణితో వ్యవహరించినా కార్మికులు భయపడే ప్రసక్తే లేదు అని తేల్చి చెపుతున్నారు. జేఏసీ నేతలు కూడా కార్మికులకు భరోసా ఇస్తూ మనోధైర్యం అందిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp