తెలంగాణ వ్యాప్తoగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు డ్యూటీలో చేరేందుకు వారి వారి డిపోల వద్ద క్యూ కట్టారు. ఉద్యోగాల్లో చేరండి అని సీఎం కేసీఆర్ పిలుపునిస్తే కనీస స్పందనలేని చోట…. కార్మిక సంఘాల పిలుపు తో కార్మికులు బారులు తీరారు.
అయితే… మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, పోతారు… అది కుదరదు, మేం ఉద్యోగాల్లోకి తీసుకోమ్ అంటూ ఆర్టీసీ ఎండీ ప్రకటన చేశారు.
కార్మిక సంఘాల ప్రకటనతో డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాత్కాలిక ఉద్యోగులకు పోలీస్ భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం.
దీనిపై ఆర్టీసీ కార్మికులు, జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం చేస్తున్న దామనకా0డను వ్యతిరేకించాలని ప్రజాస్వామ్య వాదులను వారు కోరుతున్నారు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వరా అని ప్రశ్నించారు.