ఆర్టీసి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, యూనియన్ల పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసి కార్మిక సంఘాల కీలక భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశం తరువాత ఆర్టీసి జెఎసి కీలక ప్రకటన చేయబోతోంది.
యూనియన్ ల అవసరం ఆర్టీసి కి లేదంటూ, యూనియన్ల వల్లే ఆర్టీసి నాశనం అవుతోందంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసి సంఘాలు సీరియస్ గా ఉన్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.