తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. జేబీఎస్ వద్ద చేపట్టిన వంటా వార్పు కార్యక్రమానికి అఖిలపక్ష నేతలు, వివిధ రాజకీయా పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ,సిపిఎం, జనసేన పార్టీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18 రోజులకు చేరుకుంది.