ఐక్యతతో ఓడి గెలిచిన కార్మికులు - Tolivelugu

ఐక్యతతో ఓడి గెలిచిన కార్మికులు

Rtc employees won after loss as they are united, ఐక్యతతో ఓడి గెలిచిన కార్మికులు

ముమ్మాటికీ ఇది కార్మికుల సంఘటిత విజయం. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా యూనియన్స్ ఐక్యత తో సాధించుకున్న ఘనవిజయం. ఎవరి దయా దాక్షిణ్య లతో సమస్యలు పరిష్కారం కాలేదు. కాకపోతే ప్రభువుల దయతో మనకు వరాలు ప్రకటించారు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ప్రకటించాల్సిన వారే కనుక మనం అడగనివి కూడా మనకు ఇచ్చారు. కనుక పాలకుడు ఎంత గొప్ప మనస్సున మహారాజు ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూసివుండం అనికూడా అనుకోవచ్చు.

డాక్టర్ హత్యపై కేసీఆర్ మూడు రోజుల మౌనం ఎందుకు…?

నిజమే ఇన్ని చేసిన మహారాజు మరి సమ్మె కాలంలో ఎందుకు అంత కాఠిన్యంగా ఉన్నారు… మనమీద ఆత్మహత్యలు జరుగుతున్నా… గుండె పగిలి చనిపోతున్నా… మహిళ కార్మికులు కంటతడిపెట్టిన చలించని హృదయం అది. పైగా పోలీసులతో ముందస్తు అరెస్టులు, చనిపోయిన కార్మికుల మృతదేహాలు బలవంతంగా పోలీసులతో తరలించడం, మహిళల కార్మికులపై లాఠీఛార్జ్ లు చేయించడం, సమ్మెపై ఉక్కుపాదం మోపడం సమ్మె ముమ్మాటికీ చట్ట వ్యతిరేకం అని చెప్పడం ఇలా అనేక రకాలుగా వేధించారు. కాని ఇప్పుడు ఎందుకు ఇంతగనంగా వరాలు ప్రకటించారు…? అప్పుడు ససేమిరా అన్న పెద్దమనిషి, డబ్బులు లేవు… సంస్థను నడపలేమని యాబై శాతం రూట్స్ ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వాల్సిందే… పోటీతత్వం ఉండాలి అప్పుడే లాభాలు వస్తాయి అంటూ ఐదువేల ఒక్కవంద రూట్స్ ను ప్రైవేట్ వారికి ఇవ్వడానికి క్యాబినెట్ అనుమతి కూడా తీసుకున్నారు.

ఎమ్మార్వో విజయారెడ్డి కేసు-అటెండర్ కూడా మృతి

ఇదే విషయాలు హైకోర్టుకు చెప్పారు. యాబై కోట్లు ఇస్తే సమ్మెకు పరిష్కారం లభిస్తుంది అని కోర్టు అంటే కూడా డబ్బులు లేవని చెప్పారు. పనిచేసిన సెప్టెంబర్ నెలకు కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా సంస్థ దగ్గర డబ్బులు లేవు అని చెప్పిన సీఎం ఇప్పుడు కార్మికుల పట్ల ఇంత పెద్దఎత్తున సానుభూతి చూపించడం వెనుక ఏమిటి ఆంతర్యం ఏమయివుంటుంది…? ఇంత సడన్ గా ఎందుకు యుటర్న్ తీసుకున్నారు…? ఇలా అనేక సందేహాలు, ప్రశ్నలు తలెతుతున్నాయి.

ఆ నలుగురు నిందితులకు జైల్లో విందు భోజనం

తెరవెనుక ఏమైనా జరిగిందా లేక కార్మికుల సంఘటిత శక్తి ప్రభుత్వాన్ని కదిలించిందా ఇలా అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. యూనియన్స్ వదలి విధులలో చేరమని ఒకటికి రెండసార్లు కార్మికులకు తాను పిలుపు ఇచ్చినా చేరలేదు. ఎంత నిర్భంధం ప్రయోగించినా జంకలేదు. హైకోర్టులో ప్రభుత్వం చేతులెత్తేసినా… సంస్థను నడపలేము అని చెప్పినా… యాబై శాతం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాల్సిందే అని అన్నా ఇలా ఎన్ని ఒత్తిడులు చేసిన కార్మికులు లొంగలేదు. పైగా రోజురోజుకీ వారిలో మిల్టెన్సి పెరిగిపోయింది. ఇలా ఎన్ని రోజులైనా సమ్మె చేస్తాం అన్న ధోరణి కనపడింది.

ముందు జాగ్రత్త చర్య వల్లే నిందితులు త్వరగా పట్టుపడ్డారు

మరోవైపు ప్రజలలో వారికి సానుభూతి రావటం, అటు కేంద్రం ఇటు కోర్టుల జోక్యం పెరిగింది. ఇలా అన్ని వైపుల నుండి ప్రభుత్వానికి ఒత్తిడి పెరగటానికి తోడు ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలతో సమ్మె ఇలాగే కొనసాగితే ఇతర వర్గాలలో కూడా ధైర్యం పెరుగుతుంది. ప్రభుత్వం అంటే గౌరవం, భయం పోతాయని… తనకు మానవత్వం లేదు అని అనుకుంటారని… భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి ఇదంతా నష్టమని తెలివికలిగిన నాయకుడిగా, చతురత తెలిసిన ముఖ్యమంత్రిగా తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టి… సీఎం కేసీఆర్ ఈ కథ నడిపించారని విశ్లేషిస్తున్నారు. ఓవైపు ఇలా చేస్తూనే… కార్మికులను ఇంప్రెస్స్ చేస్తూనే యూనియన్స్ లేకుండా చేయడం అలాగే విపక్షాలకు చెక్ పెట్టడంతో తన ఇమేజ్ కు డ్యామేజ్ కాదు అని గ్రహించి చక్రం తిప్పారు. కార్మికులను ఫిదా చేశారు. య్యూనియన్స్ ప్రస్తావన లేకుండా చేసారు. కార్మికుల దగ్గర మార్కులు కొట్టేశారు.

ప్రభుత్వ చేతగానితనం.. వేలాది ఉద్యోగులకు శాపం

అయితే ఒకటి మాత్రం నిజం. కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ కి భయపడి నాడు కార్మికులు విధులలో చేరివుంటే నేడు ఇన్ని వరాలు వచ్చేవికావు. అలాగే చివరికంటా కార్మికులు కార్మిక సంఘాలు నిలబడలేక పోయినా ఇవి వచ్చేకావు. అంటే పోరాడితే పోయేది ఏమీలేదు భానిస సంకెళ్ళు తప్ప అన్నట్లుగా పోరాడిన ఫలితమే నేడు ప్రభుత్వం ప్రకటించిన వరాలు. అందరూ కార్మికుల ఐక్యత ఎప్పటికైనా అవసరమే, చీలిపితే ఒడిపోతం… కలసి ఉంటే సాధిస్తాం… ఇది రేపటికి కూడా వర్తిస్తుంది. కార్మికులలారా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

ప్రియాంకారెడ్డి  హత్య కేసులో ముగ్గురు పోలీసులపై వేటు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఅర్ కార్మికులకు చెప్పిన పిట్ట కథలాంటి కథ ఒకటి ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. తెలివిగల నక్క అమాయకపు… కాకి మధ్య జరిగిన సంభాషణ…. కాకి వేటకు వెళ్లి ఒక మాంసం ముక్క తెచ్చుకుని చెట్టుమీద కూర్చుని తినే ప్రయత్నం చేస్తుంది …. అది చెట్టు కింద కూర్చున్న నక్క చూసింది. ఆ మాంసం ముక్కను ఎలాగైనా కొట్టేయాలని భావించి… అందుకు జిత్తుల మారి నక్క ఊపాయం ఆలోచించింది. కాకీతో ఇలా అంటోంది….. కాకీ బావా… కాకీ బావా ….నీవు చాలా బాగా పాడుతవటగా పాడవా అని అడిగింది. అది పాడితే నోట్లో ముక్క కింద పడితే కాజేయలని. ఇది గమనించిన కాకీ అవునా పాడుతా అంటూ నోట్లో ఉన్న మాంసం ముక్కను కాలికింద పెట్టుకొని పాడడం మొదలు పెట్టింది. నక్కకు ఏమిచేయాలో అర్దం కాలేదు. అప్పుడు మళ్లీ ఆలోచించి నీవు బాగా డాన్స్ చేస్తావంటగా చెయ్యి చూద్దాం అంది. అప్పుడు కాకీ మాంసం ముక్కను నోట్లో పెట్టుకొని డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఎలాగైనా మాంసం ముక్కను కాజేయలని భావించిన నక్కకు కాకీ బావా ఎది నీవు పాడుతూ డాన్స్ చేస్తవంటగా చేయవా చూద్దాం అంది. కాకీ నక్క జిత్తును గ్రహించి గుటుక్కున మాంసం ముక్క మింగి పాడుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. జిత్తుల మారి నక్క విస్తుపోయింది. కాకీ కూడా తెలివి నేర్చింది… ఇక నా ఆటలు సాగవు అని గుర్తించింది నక్క. అందుకే అమాయకపు కాకీని మోసం చేయచ్చు అనుకున్న నక్క ఎత్తులను జిత్తు లను కాకీ ఎలా చిత్తు చేసిందో అలా కార్మికులు కూడా చిత్తు చేయాలి అప్పుడే మీకు మనుగడ ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ముందే ఈ పని చేసుంటే ఇన్ని ప్రాణాలుపోయేవా

Share on facebook
Share on twitter
Share on whatsapp