– గాడిన పడకుంటే…
– రోడ్డున పడవేస్తారా..?
హైదరాబాద్, తొలివెలుగు: ఎన్నికలగానే దళితబంధు వంటి పథకాల పేరుతో లక్షల కోట్ల తాయిలాలిచ్చే ఏలినవారికి..కొన్ని కోట్ల మంది బడుగు బలహీనవర్గాలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ అంటే మాత్రం ఎప్పుడూ చిన్నిచూపే. అందుకే మరోసారి ఆర్టీసీపై కత్తిని వేలాడదీశారు. ఇప్పటికే జీతాలు టైంకు రాక మొర్రో అంటున్న కార్మికుల నెత్తిపై..ప్రైవేటు బండ వేస్తామని హెచ్చరించారు. రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ దారిలోకి రాకుంటే, ప్రైవేటు పరం తప్పదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమీక్షలో ఎండీ సజ్జన్నార్, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇదే విషయాన్ని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని రక్షించాలనే ప్రణాళికేతర నిధుల నుంచి 3వేల కోట్లు కేటాయించినా..ఫలితాలు మాత్రం అనుకున్నట్టు రాలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.