తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసంలోనే దీక్షకు కూర్చున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తానని అన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పారు. నిరాహార దీక్షకు దిగుతున్నారని తెలియడంతో అర్ధరాత్రి పోలీసులు భారీగా ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. పోలీసులు అర్ధరాత్రి తన ఇంటిని చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేశారని అశ్వత్ధామరెడ్డి తెలిపారు.