మా డిమాండ్స్‌లో ఏ ఒక్కటి కూడా వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. మా డిమాండ్స్‌లో తప్పులు ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ పెట్టండి, తప్పని రుజువైతే రేపటి నుంచే విధుల్లోకి వస్తామన్నారు. తెలంగాణ వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలన్నారు. ప్రభుత్వంలో విలీనం చెయ్యకపోవటానికి కారణాలు ఏంటో కేసీఆర్ స్పష్టంగా చెప్పాలన్నారు. రేపు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద సంఖ్య లో కార్మికులు హాజరు కావాలని కోరారు. ప్రతి జిల్లాలో కూడా పర్యటించి కార్మికులకు వారి కుటుంబాలకు దైర్యం చెప్తామని ఎవ్వరు అధైర్యపడకుండా పోరాట స్పూర్తితో అనుకున్న డిమాండ్లను సాదిస్తామన్నారు.