సమ్మె యధాతదంగా కొనసాగుతుందని, శుక్రవారం ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వటం, శనివారం నుండి గాంధీ, జయశంకర్ విగ్రహాల వద్ద వినతి పత్రంతో మౌన ప్రదర్శన చేస్తామన్నారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తరుపున సమ్మెకు అందరి మద్దతు కోరుతున్నామన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్ లను తీర్చేవరకు సమ్మె యధాతధంగా జరుగుతుందని ప్రకటించింది ఆర్టీసీ జెఏసీ.