కేసీఆర్ డైడ్‌లైన్‌ను పక్కనపెట్టి షాక్ ఇచ్చిన ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. ఈనెల 9న మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని, అన్ని పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామన్నారు. ఇప్పటికే బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు.
మంత్రులే స్వయంగా కార్మికులను బ్రతిమాలి… తమ కాన్వాయ్‌లో ఎక్కించుకొని వెళ్లి డ్యూటీలో జాయిన్ చేసినా, మా కార్మిక సోదరులు తిరిగి వచ్చారని… కేసీఆర్ డెడ్‌లైన్‌కు ఎవరూ భయపడలేదన్నారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీపై ప్రభుత్వం ఏమీ చేయలేదని… ఇప్పటికే తమ ప్రతినిధి బృందం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిందని ప్రకటించారు.
తాము ఇప్పటికీ చర్చలకు సిద్ధమని… చట్టబద్దత ఉంటే అటెండర్ కమిటీతో అయినా రెడీ అని ప్రకటించారు. సీఎం పంతాలకు పోయి సమస్యను ఇంకా జఠిలం చేయొద్దని కోరారు.