ప్రభుత్వం ఇక అయినా తన వైఖరిని మార్చుకోవాలన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు ఆయన. సోమవారం నుంచి ప్రతి బస్సు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు కుటుంబాలతో నిరసనలు తెలుపుతామని తెలిపారు. 23 న ప్రజాప్రతినిదులును కలుస్తామని, 24 న మహిళా కండెక్టర్ లతో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. 30 న ‘సకలజనుల సమరభేరి’ అనే పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నద్ధాలు చేస్తున్నట్టు తెలిపారు.శనివారం న్యూ డెమోక్రసి నేత పోటు రంగారావు పై ఉద్దేశపూర్వకంగా దాడి చూశారని ఆరోపించారు.ప్రభుత్వం దిగివచ్చేవరకు యధాతదంగా సమ్మె జరుగుతుందన్నారు. ఈ సమావేశం లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, తమ్మినేని వీరబద్రం, కోదండరాం లు పాల్గొన్నారు.