ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ అధికారికంగా ప్రకటించింది. 52 రోజుల పాటు కార్మికులు ఎంతో పట్టుదలతో సమ్మె కొనసాగించారని.. ఆర్టీసీని రక్షించుకునేందుకు రేపటి నుండి విధులకు హాజరవుతామని జేఏసీ ప్రకటించింది.
తాత్కాలిక ఉద్యోగులు ఇక విధులకు రావద్దని, మంగళవారం ఉదయం 6 గంటల నుండి విధులకు హాజరుకాబోతున్నట్లు యూనియన్ నాయకులు అశ్వద్ధామరెడ్డి ప్రకటించారు.
కార్మికులు సమ్మె చేయటం అంటే… సమస్యల పరిష్కారానికే తప్పా ఉద్యోగాలను విడిచిపెట్టడం ఉద్దేశం కాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది ఆర్టీసీ జేఏసీ. యాధావిధిగా తాము విధులకు హాజరయ్యేందుకు సమ్మెకు ముందున్న పరిస్థితులను కల్పించాలని ప్రభుత్వంను కోరారు కార్మికులు.
తమ సమ్మెకు సహాకరించిన రాజకీయ పార్టీలకు, నేతలతో పాటు తమకు సహకరించిన పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జేఏసీ నేతలు.