రాష్ట్ర ప్రభుత్వం తో అమీతుమీ...ఆర్టీసీ జేఏసీ - Tolivelugu

రాష్ట్ర ప్రభుత్వం తో అమీతుమీ…ఆర్టీసీ జేఏసీ

rtc jac ready to fight on trs govt, రాష్ట్ర ప్రభుత్వం తో అమీతుమీ…ఆర్టీసీ జేఏసీ

తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్టీసీ జేఏసీ, కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది.ఆర్టీసీ కార్యక్రమాలలో విస్తృతంగా అందరూ పాల్గొనాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

ఆర్టీసీ జేఏసీ, కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశాలలో నిర్ణయం తీసుకున్న అంశాలు…

11న టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అడ్డుకొని మద్దతు కోసం వినతి..

12న ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల దీక్షలు

18న సడక్ బంద్, వంటావార్పు

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నేతృత్వంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసేందుకు కమిటీ..

సంపత్ ఆధ్వర్యంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్, మహిళ హక్కుల కమిషన్ లను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రణాళిక..

ఆర్టిసి కార్మికుల సమ్మె ను మరింత ఉదృతం చేసే దిశగా ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు ఆర్టీసీ జేఏసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, టీపీసీసీ నాయకులు వినోద్ రెడ్డి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ భవన్ లో కోర్ కమిటీ ముఖ్యులతో చర్చించారు.

ఈ సమావేశంలో నాయకులు భట్టి, వంశీచంద్, సంపత్, వి.హెచ్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, పొన్నం, కుసుమ కుమార్ తడితరులతో చర్చించారు.

ఆర్టీసీ చేపట్టిన కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని, అన్ని ఉద్యమాలు విజయవంతం అయ్యేలా చూడాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 11వ తేదీన కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ కార్యకర్తలతో కలిసి టిఆర్ఎస్ ఎమ్యెల్యే, ఎంపీ, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని, ఆర్టీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించినట్టు భట్టి తెలిపారు.

12వ తేదీన రాష్ట్రంలో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అశ్వద్దామ రెడ్డి తోపాటు ఆర్టీసీ జేఏసీ నాయకులు దీక్షలు చేయనున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా డిపో ల వద్ద కార్మిక సంఘాలు చేసే దీక్షలకు మద్దతుగా పాల్గొనాలని ఆయన పిలుపుఇచ్చారు.

అప్పటికి ఇంకా పరిష్కారం కాకపోతే 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్ తోపాటు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక నాయకులను, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాలు, గృహ నిర్బందాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇకపై ప్రభుత్వంతో అమీ తుమి తేల్చుకుంటామని భట్టి ప్రకటించారు.

కాగా రాష్ట్రంలో మానవ హక్కులు హరించబడుతున్నాయని, మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ విషయమై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నేతృత్వంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, తదితరులతో కమిటీ వేశామని కమిటీ త్వరలో జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళ హక్కుల కమిషన్ లతో సమయం తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ఫిర్యాదు చేయనుందని తెలిపారు.

ఈ అంశాలపై ఎవరి వద్ద ఎలాంటి సమాచారం, ఆధారాలు ఉన్నా కమిటీకి అందజేయాలని అన్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp