ఆర్టీసీ కార్మికుల సమ్మై ప్రభుత్వం, మంత్రుల వైఖరిపై కార్మిక సంఘం నేత అశ్వద్ధామరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నా ఫోన్ ట్యాప్ చేస్తూ… తమ కదలికలపై నిఘా పెడుతున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న ఉద్యమంలో ఉన్న మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు.
హైకోర్టు సూచించినా… ఆర్టీసీ సమ్మెపై చర్చల కోసం సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించటం లేదు. చర్చల్లేవ్ అన్న మాటకే కట్టుబడేలా ఉన్నట్లు కనపడుతోంది. దీంతో… చర్చల ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనపడటం లేదు. అయితే, రవాణా శాఖ అధికారులతో సీఎం గంటల తరబడి మీటింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.