ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ దమనకాండపై పోరాటానికి ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుంటే… ప్రభుత్వం నిరంకుశంగా దాడి చేసిందని జేఏసీ గవర్నర్‌కు ఫిర్యాదు చేయనుంది.
ముఖ్యంగా మహిళలే టార్గెట్‌గా మిలియన్ మార్చ్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడ్డ మహిళలు, కార్మికులతో గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం, హైదరాబాద్ పోలీసులపై గవర్నర్‌కు అజమాయిషీ ఉందన్న విషయం కేసీఆర్ మర్చిపోతున్నట్లున్నారు అంటూ హెచ్చరిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు.
ఓ మహిళా గవర్నర్‌గా మహిళా కార్మికులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకుంటుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కోర్టులో సమ్మెపై విచారణ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, ఈలోపు గవర్నర్‌కు కలుస్తామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి ప్రకటించారు.