హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. నగరంలోని ప్రధాన విగ్రహాలన్నీ హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గణేష్ నిమజ్జనంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తన ఇంట్లో పూజ చేసిన వినాయకుడ్ని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకెళ్లారు. బస్సులో సజ్జనార్ తో సెల్ఫీలకు జనం ఎగబడ్డారు.
మూడు రోజుల క్రితం కూడా సాధారణ ప్రయాణికుడిలా సిటీబస్సులో ప్రయాణించారు సజ్జనార్. లక్డీకపూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు వెళ్లారు. ఎంజీబీఎస్ లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.