ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోమంటూ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మీడియాకు విడుదల చేసిన ప్రకటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ శర్మ ప్రకటన కార్మికులను అవమానించే విధంగా… వాళ్ళ మనోభావాలను గాయపరిచే విధంగా ఉందంటున్నారు విశ్లేషకులు. కార్మికులు సమ్మె విరమిస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందంటూ సునీల్ శర్మ చేసిన ప్రకటన సీనియర్ ఐఏఎస్ అధికారి హోదాలో కాకుండా… రాజకీయ నాయకుడి హోదాలో చేసినట్లు ఉందని అంటున్నారు. కార్మికులు సమ్మె విరమిస్తునట్ల్లు ప్రకటిస్తే దానిని పాజిటివ్ గా తీసుకొని… యాజమాన్యం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని… లేబర్ కమిషనర్ నిర్ణయం తరువాత ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రకటించి ఉంటే బాగుండేదని… అలా కాకుండా కార్మికులను ఎగతాళి చేసేవిధంగా… వారి మనోభావాలను గాయపరిచే విధంగా… ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రకటించడం విచారకరమంటున్నారు. ప్రకటన పై సునీల్ శర్మ సంతకం తెలుగులో ఉండడం చూస్తుంటే ఆ ప్రకటన ఆయనే ఇచ్చారా? లేక సీఎం కార్యాలయం ఆయన పేరుతో విడుదల చేసిందా? అనే అనుమానం కలుగుతుందంటున్నారు. ప్రకటనలో ఉన్న కంటెంట్ ను చూసినా… తెలుగులో సునీల్ శర్మ సంతకం చూసిన తమ అనుమానాలకు బలం చూకూర్చుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్టీసీ ఎండీ హోదాలో చేసిన ప్రకటన కఠినంగా… కార్మికులను గాయపరిచే విధంగా ఉందని…యూనియన్ నాయకుల మాట వినద్దు అంటూనే కార్మికులందరిని అవమానపరిచే విధంగా ప్రకటన ఉందంటున్నారు విశ్లేషకులు. పైగా డిపోల దగ్గరకు వెళ్లి తాత్కాలిక సిబ్బందికి అంటకాలు కలిగిస్తే కఠిచర్యలు తప్పవు అంటూ హెచ్చరికలు జారీచేశారని… ఈ ప్రకటనతో కొందరు కార్మికులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్య లకు పాల్పడే ప్రమాదం కూడా లేకపోలేదని.. జరగకూడని సంఘటన లు ఏమైనా జరిగితే దానికి ఎండీ సునీల్ శర్మ బాధ్యతవహించాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.