సీఎం కేసీఆర్‌తో ఆర్టీసీ ఎండీ భేటీ అయ్యారు. ఓవైపు ఆర్టీసీ యూనియన్లు సమ్మెను విరమిస్తామని ప్రకటించటం, మరోవైపు సీఎం కేసీఆర్ గవర్నర్‌తో రెండు గంటలకు పైగా సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకోగా… గవర్నర్‌తో భేటీ ముగించుకొని రాగానే సీఎంతో భేటీ అయ్యారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.
ఉద్యోగులు రేపు ఉదయం నుండి విధుల్లోకి వస్తారని ప్రకటించటం, తాత్కాలిక ఉద్యోగులు ఇక మానండి అంటూ ప్రకటించిన నేపథ్యంలో… ఉద్యోగులను చేర్చుకోవాలా…? చేర్చుకుంటే కండిషన్స్ ఎలా ఉండాలి…? భేషరుతుగా చేర్చుకోవాలా…? రూట్స్ ప్రైవేటైజేషన్ అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.