మెఘా కోసమే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను బదిలీ చేశారా? నిక్కచ్చిగా, నిజాయితీగా వుండే సురేంద్రబాబుని అంత సడెన్‌గా ఎందుకు బదిలీ చేశారు? ఇదేనా రివర్స్ టెండరింగ్ పరిపాలన అంటే…
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర బాబు ఆకస్మిక బదిలీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంత హడావుడిగా ఆయన్ని ఎందుకు బదలీ చేయవలసి వచ్చిందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్లు అంటే రెండే రెండు పేర్లు చెబుతారు.. అందులో ఒకరు.. నండూరి సాంబశివరావు. రెండు సురేంద్రబాబు..
నండూరి సాంబశివరావు డీజీపీగా కంటే ముందు ఆర్టీసీకి పనిచేశారు. ఆయన ఎండీగా వున్నప్పుడు ఆర్టీసీ బస్టాండులు ఎయిర్ పోర్టులుగా రూపుదిద్దుకున్నాయి. టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంలో నండూరి పాత్ర బాగా వుంది. ఎయిర్ పోర్టులు మాదిరి రాష్ట్రంలో వున్న అన్ని బస్డాండుల్ని బస్ పోర్టులుగా మార్చిన ఘనత ఆయనదే. అలా తనదైన ముద్రతో ఆయన ఆర్టీసీ సంస్థ చరిత్రలో నిలిచిపోయారు.ఇక నండూరి తరువాత చెప్పుకోవాల్సిన పేరు.. ఇఫ్పుడు బదిలీ అవుతున్న సురేంద్రబాబు.
సురేంద్రబాబు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా సైలెంటుగా పనిచేసుకుంటూ పోయారు. పాలనాపరమైన మార్పులపై సురేంద్రబాబు బాగా ఫోకస్ పెట్టారని చెబుతారు. ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో సురేంద్రబాబు ఏమాత్రం వెనుకాడులేదు. ఆయన హయాంలోనే ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ సంస్థగా అవతారం దాల్చింది.
ఇలావుంటే.. సడెన్‌గా సురేంద్రబాబును బదిలీచేయడం వెనుక పెద్ద హస్తాలేవైనా వున్నాయా.. అని మీడియా ఆరా తీస్తే తీరా తెలిసిందేమంటే.. దీని వెనుక మెఘా హస్తం వుందట.. పోలవరం ప్రాజెక్టు తక్కువ ధరకు సింగిల్ బిడ్ ద్వారా దక్కించుకున్న మెఘా కంపెనీకి మరో విధంగా మేలు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అంటూ ప్రతిపక్ష టీడీపీ గగ్గోలు పెడుతోంది. మెఘా కృష్ణారెడ్డికి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, చైనాకు చెందిన బివైడితో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీకి మేలు చేయాలని.. పోలవరం ప్రాజెక్టుకు తక్కువ కోట్ చేయించి ఆ నష్టాన్ని ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సుల కొనుగోలు రూపంలో మేలు చేస్తోంది అని టీడీపీ ఆరోపిస్తుంది.
ఈ నేపథ్యంలో రేపు ఎలక్ట్రిక్ బస్ టెండర్ ప్రీబిడ్ (electric bus tender prebid) మీటింగ్ జరుగుతోందనగా ఇవాళ అకస్మాత్తుగా సురేంద్రబాబు బదిలీ జరిగింది. అంటే దీని వెనుక జగన్ సర్కార్ ఆలోచన ఏంటో అందరికీ సులభంగానే అర్ధం అవుతుంది.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల టెండర్‌ను మెఘా కృష్ణారెడ్డికి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, చైనాకు చెందిన బివైడితో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీకి భాగస్వామికి కట్టబెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బదిలీ అంటోంది టీడీపీ టీమ్. ఆర్టీసీ ఎండీగా వున్న సురేంద్రబాబు నిజాయితీ గల అధికారి. తన ముక్కుసూటితనమే మెఘా అడ్డగోలు వ్యవహారానికి అడ్డంకి అవుతుందనే ముందుచూపుతో బదిలీ జరిగినట్టు భావిస్తున్నారు. సురేంద్రబాబు బదిలీకి అసలు కారణం మెఘా అని తెలుసుకున్నాక ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా భగ్గుమంటున్నారు.