ఆర్టీసీ మిలియన్ మార్చ్ - Tolivelugu

ఆర్టీసీ మిలియన్ మార్చ్

rtc million march at tankband, ఆర్టీసీ మిలియన్ మార్చ్

నిర్భందాలను గడ్డిపోచల్లా, పోలీసు తుపాకులకు ఉద్యమకారుల చాతి చూపుతూ… మీ అరెస్టులు, బెదిరింపులు ఉద్యమాన్ని ఆపలేవని నినదించిన సందర్భం తెలంగాణకు మిలియన్ మార్చ్. ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ కామ్‌గా ఇంట్లో ఉన్నా… ఉద్యమకారులే ఉద్యమాన్ని నడిపించిన సందర్భం అది. హుస్సేన్ సాగర్ తీరానికి పోటేత్తిన ఉద్యమకారులు మాకు న్యాయం కావాలి, మాకు స్వరాష్ట్రం కావాలి అని నినదించిన సందర్భం అది. అందుకే మిలియన్ మార్చ్‌ తెలంగాణ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘట్టం.

సరిగ్గా అదే స్పూర్తితో… మాకు న్యాయం కావాలి, మమ్మల్ని అర్ధాకలితో చంపుతున్న మీ అహం తగ్గాలన్న కసితో ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నారు. మీ అరెస్ట్‌లు, బెదిరింపులు ఉద్యమాన్ని ఆపలేవని… ఆర్టీసీ కార్మిక లోకం, ఆ కుటుంబాలు సాగర తీరాన గర్జించాలని నిర్ణయించాయి. తెలంగాణ ఉద్యమం నేర్పిన పోరాట పటిమతో… మీ నిర్భందపు పద్మవ్యూహన్ని చేధిస్తామని హెచ్చరిస్తున్నారు. 2011 మార్చి 10ని మరోసారి పునరావృతం చేస్తామని కార్మికలోకం గర్జిస్తోంది.

అయితే, తెలంగాణ మిలియన్ మార్చ్‌లో పోలీసులు ఫెయిల్యూర్‌ అయినట్లు ఆర్టీసీ విషయంలో కాకుడదని ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం ఇప్పటికే వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆర్టీసీ యూనియన్ కీలక నాయకులను అదుపులోకి తీసుకుంటుంది. జిల్లాల్లో సైతం కీలక నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. మిలియన్ మార్చ్‌కు అనుమతి లేదని, కార్మికులు… వారి కుటుంబ సభ్యులెవరూ ట్యాంక్‌బండ్‌పైకి రావొద్దని, అనవసర కేసుల్లో ఇరుక్కొవద్దంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.

అయితే, పోలీసుల బెదిరింపులకు లొంగేది లేదని… 48వేల మందిని అరెస్ట్ చేయగలరా అంటూ ప్రశ్నిస్తోంది.

మిలియన్ మార్చ్‌కు సంబంధించిన లైవ్ అప్టేడ్స్, విజువల్స్ ఎప్పటికప్పుడు మీ తొలివెలుగులో…. శనివారం ఉదయం నుండి.

Share on facebook
Share on twitter
Share on whatsapp