ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే అఖిలపక్షాలు, ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నాయి. వరంగల్ జిల్లా పరకాల వద్ద అఖిలపక్ష నాయకులు బస్సులను అడ్డుకున్నారు.కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీనితో రంగంలో కి దిగిన పోలీస్ లు వాళ్ళని అరెస్ట్ చేసారు. కాసేపు పరకాల బస్సు స్టాండ్ వద్ద పోలీస్ లకు,అఖిలపక్షాల నాయకుల మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత వాతావరం నెలకొంది. బందు పేరుతో బయటకు వస్తున్న నాయకులను, కార్మికులను పోలీస్ లు అరెస్టులు చేస్తున్నారు.