ఆర్టీసీలో తాత్కాలిక కండెక్టర్‌పై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. తాత్కాలిక డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకోకుండా… పథకం ప్రకారం లైంగిక దాడికి యత్నించాడు. అయితే, తాత్కాలిక కండక్టర్ చాకచక్యంగా తప్పించుకొని, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు కేసు కూడా నమోదైంది.