తెలంగాణ ఆర్టీసి జెఏసీ చైర్మన్, TMU ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఆర్టీసి యాజమాన్యం నన్ను ఉద్యోగం నుండి తొలగించాలని సవాల్ చేశారు. కేసీఆర్ చెప్పిందే నడవాలంటే కుదరదని స్పష్టం చేశారు. యూనియన్లు లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యమని, కానీ అది అంతా ఈజీ కాదని, ఆర్టీసి కార్మికుల హక్కుల కోసం పోరాడతామన్నారు.
అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసి యాజమాన్యం షోకాజ్ నోటీసు జారీ చేసింది. తను పెట్టుకున్న 6 నెలల సెలవు ఇవ్వడం కుదరదని, తక్షణమే విధుల్లో చేరాలని, లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది.ఈ సందర్భంలో అశ్వత్థామ రెడ్డి తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో మాట్లాడారు. ఇంకా ఏం మాట్లాడారో, ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారో కింది వీడియోలో చూడొచ్చు…