ఓవైపు ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నా… ఆర్టీసీ కార్మిక సంఘాలు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాము న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెకు దిగామని, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు ఆర్టీసీ జెఎసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి.
రేపటి నుండి రోజుకో కార్యక్రమం చేపడుతామని… సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. ఆదివారం ప్రతి డిపో ముందు బతుకమ్మ ఆటలు ఉంటాయని, సోమవారం నుండి ఆమరణ నిరహార దీక్ష చేపడతామని తెలిపారు. ఇందిరా పార్క్ వేధికగా అమరణ నిరహర దీక్ష చేస్తామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.