ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉదృతమవుతోంది. మరో వైపు జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రోజుకో కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్న ప్రభుత్వం మాత్రం తన వైఖరి మార్చుకోవట్లేదు. ఇప్పటికే చలో ట్యాంక్ బండ్ తో ఆర్టీసీ కార్మికులు తమ సత్తా చూపించారు. వేల మంది పోలీసులను దాటుకుని ట్యాంక్ బండ్ ముట్టడి చేశారు. మరో వైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షాలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి.
ప్రభుత్వం ఎంత నిర్బంధం విధించినా ఆర్టీసీ కార్మికులు మాత్రం తమను చర్చలకు పిలవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎప్పటికప్పడు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈరోజు నిరవధిక దీక్ష చేయనున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. దాంతో అశ్వద్ధామ రెడ్డి, రాజి రెడ్డి సహా నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధ చేశారు. ఇంటి నుంచి బయటకు రానీయకపోవడంతో ఆర్టీసీ కార్మికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.