ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలం అయ్యాయి. సమావేశం నుంచి అర్ధాంతంగా ఆర్టీసీ యూనియన్ నేతలు బయటకు వచ్చారు. 40 అంశాలు ఉంటె 21 అంశాలు పై చర్చ జరిపారని, మా ఫోన్ కూడ తీసుకుని బెదిరించే ప్రయత్నం చేశారన్నారు అశ్వత్థామ రెడ్డి. పూర్తి డిమాండ్ లు పరిష్కరిస్తే చర్చలకు సిద్ధం అన్నారు జేఏసీ నాయకులు. కోర్ట్ చెప్పింది కాబట్టి… ఏదో ఒక చర్చ జరపాలని ప్రభుత్వం ఈ చర్చలు జరిపిందే తప్ప కార్మికులపై ప్రేమతో కాదన్నారు. డిమాండ్లన్నీ పరిష్కరించాలని, చర్చ జరగకుండా సమ్మె విరమించాలని మా పై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు.