ఆర్టీసీ కార్మికుల సమ్మెను నీరుగారుస్తున్నారంటూ ఇంటికి తాళం వేసుకొని ఇంట్లోనే మహిళా కార్మికులు దీక్షకు కూర్చున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కార్మికులు 43 రోజులుగా సమ్మె చేస్తుంటే, ఆ సమ్మెను నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని నిర్ణయించుకున్న ఆర్టీసీ మహిళా కార్మికులు…భయట నుంచి ఇంటికి తాళం వేసుకొని ఇంట్లోనే ఉదయం నుంచి దీక్షలు చేస్తున్నారు…
ఆర్టీసీ కార్మికులను అర్ధరాత్రి నుంచి పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారని,మహబూబ్ నగర్ పట్టణంలోని మర్లుకాలనీలోని ఓ ఇంట్లో మహిళా కార్మికులంతా ఉదయం నుంచి ఆహారపానీయాలకు దూరంగా ఉంటూ తమ దీక్షను కొనసాగిస్తున్నారు… దీక్షను విరమించేది లేదని బీష్మించుకు కూర్చున్నారు…నిరాహార దీక్ష చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు తాళం బద్దలుకొడుతే ఆత్మహత్య చేసుకుంటామని మహిళ కార్మికులు హెచ్చరిస్తున్నారు.