సరైన డాక్యుమెంట్లు లేకుండా కారు నడుపుతున్న ఓ ఫోర్సే కారు ఓనర్ కు ఆర్టీవో అధికారులు భారీ జరిమాన విధించారు. సరైన కారు పత్రాలు, లీగల్ నెంబర్ ప్లేట్ లేకపోవడంతో 9 లక్షల 80 వేల ఫెనాల్టీ వేశారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ హెల్మెట్ క్రాస్ దగ్గర నెంబర్ ప్లేట్ లేని ఓ కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా కారుకు సంబంధించిన సరైన పత్రాలు లేవు. దీంతో కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం 9 లక్షల 80 రూపాయలను జరిమానాగా లెక్కగట్టి మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఓనర్ కు మెమో పంపించినట్టు డీసీపీ తెలిపారు. ఫోర్సే 911 స్పోర్ట్స్ కారు విలువ రూ.2 కోట్లు ఉంటుంది.