ముక్కులో రబ్బర్ ఇరుక్కుని ఓ బాలిక మూడు నెలల నుంచి నరకయాతన అనుభవించిన ఘటన రాజస్థాన్‌లోని రాజ్ కోట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. . మధన్ భాయ్ అనే వ్యక్తి కుమార్తె శివాని త్రివేది (10)కి మూడు నెలల క్రితం ముక్కులోకి రబ్బర్ వెళ్లింది.
అప్పటి నుంచి అనారోగ్యానికి గురి కాగా జలుబు అనుకుని మందులు వాడారు. దాని వలన శ్వాస ఇబ్బందులు వంటి వాటితో చిన్నారి చాలా బాధపడేది. ఇటీవల ఈఎన్ టీను సంప్రదించగా బాలిక ముక్కులో రబ్బరును గుర్తించి శస్త్ర చికిత్స చేసి తొలగించారు.
చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఒకోసారి ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని వైద్యులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.