జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రణరంగాన్ని తలపించింది. టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య డైలాగ్ వార్ మామూలుగా జరగలేదు. వాళ్లు ప్రసంగించేటప్పుడు వీళ్లు… వీళ్లు మాట్లాడేటప్పుడు వాళ్లు.. ఒకరినొకరి ప్రసంగానికి అడ్డుపడుతూ అక్కడే కొట్టుకుంటారేమో అనేలా సీన్ క్రియేట్ చేశారు.
చాలా రోజుల తర్వాత సమావేశమైన మీటింగ్ లో ప్రజల సమస్యలపై చర్చ ఉంటుందని భావిస్తే.. ఇరు పార్టీల నేతలు తిట్టుకోవడానికే సరిపోయింది. కేసీఆర్, కేటీఆర్ నిధులు ఇస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడడంపై అభ్యంతరం తెలిపారు బీజేపీ కార్పొరేటర్లు. అలాగే బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడంపై టీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు జై తెలంగాణ, భారత్ మాతాకీ జై నినాదాలతో హాల్ మార్మోగింది.
రెండు పార్టీల నేతల డైలాగ్ వార్ కొనసాగుతుండగా… కౌన్సిల్ సమావేశాన్ని త్వరగానే ముగించేశారు మేయర్ విజయలక్ష్మి. అయితే బీజేపీ కార్పొరేటర్లు హాల్ లోనే బైఠాయించారు. ప్రజా సమస్యలపై చర్చ కోసం పట్టుబడితే.. మేయర్ మధ్యలోనే సభను రద్దు చేసి పారిపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ కుంభకోణాలు బయట పడతాయనే చాలా ప్రశ్నలు తెరపైకి రాకుండా చేశారని మండిపడ్డారు బీజేపీ కార్పొరేటర్లు.