లారెన్స్ సినిమా అంటే హారర్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ గ్యారెంటీ. వీటితో పాటు ఎప్పుడూ ఉన్నట్టే అదిరిపోయే స్టెప్స్ ఉంటాయి. అందుకే అతడి సినిమాల్లో పాటల కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆ టైమ్ రానే వచ్చింది. లారెన్స్ హీరోగా నటిస్తున్న రుద్రుడు సినిమా నుంచి పాటల విడుదల కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నాడు. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. రుద్రుడు ఫస్ట్ సింగల్ ‘‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నారు. వీర తిరుమగన్(1962) చిత్రంలో ‘‘పాడాద పాటెలం’ పాట క్లాసిక్ హిట్ గా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడా క్లాసిక్ సాంగ్ ని రుద్రుడులో ట్రెండీ, ఫుట్ ట్యాపింగ్ రీమిక్స్ గా ప్రజంట్ చేస్తుండటం ఆసక్తి పెంచింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. రాకేందు మౌళి ఈ పాటకు తెలుగు సాహిత్యం సమకూర్చాడు.
ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.