పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించే విషయంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయంతో పోలుస్తూ తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి రాజకీయాలకు అతీతంగా వుండే వ్యక్తి అని ప్రతిపక్షాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మరి రాష్ట్ర గవర్నర్లు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులే కదా అని ఆమె ప్రశ్నించారు. మరి గవర్నర్ల విషయంలో ఈ భిన్నాభిప్రాయాలు ఎందుకు అని ప్రశ్నించారు.
తెలంగాణలో నూతన సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని పేర్కొన్నారు. కానీ సచివాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానించలేదన్నారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నది ముఖ్యమంత్రి కావడంతో ఆయన చేతుల మీదుగానే సచివాలయ ప్రారంభోత్సవం జరిగిందన్నారు.
ఇప్పుడు పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వైఖరిని పరోక్షంగా ప్రస్తావిస్తూ… రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా చెబుతూ…గవర్నర్ కు మాత్రం పాలిటిక్స్‌తో లింక్ ఉన్నట్లుగా మాట్లాడటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.