అనుపమ పరమేశ్వరన్ చూడటానికి సంప్రదాయబద్ధంగా తెలుగు అమ్మయిలా కనిపిస్తోంది. ఎక్కడ కూడా తన అందాలను ఒలకబోయకుండా కేవలం నటన పరంగానే మాత్రమే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది ఈ అమ్మడు. నిజానికి సినిమాలో ఛాన్స్ లు రావాలంటే ఖచ్చితంగా అందాలను ఆరబోయాల్సిందే కానీ కేవలం నటన పరంగా మెప్పించి గ్లామర్ ను పక్కకు పెట్టండి అని అంటే అవకాశాలు రావడం కష్టమే.పైగా ఇప్పుడు అందాలను ఆరబోసే హీరోయిన్స్ పోటీగా కాచుకు కూర్చున్నారు. దీంతో అనుపమకు ఛాన్స్ లు రావడం కొంత కష్టంగా మారింది.
ఐదేళ్ల కిందట మలయాళ సినిమా ప్రేమమ్ తో హీరోయిన్ గా పరిచయమైన అనుపమ…తన మొదటి చిత్రంతోనే హిట్ అందుకుంది. ఆ తరువాత తెలుగులో మాటల మాంత్రికుడు అ, ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ.మరోవైపు మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ సినిమాలో చేసిన పాత్రను తెలుగులో అనుపమ పరమేశ్వర్ చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది.
ఇక, శతమనం భవతి సినిమాతో అనుపమ ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ కావడంతో హ్యాట్రిక్ సక్సెస్ లతో అనుపమకు తిరుగుండదని అంత అనుకున్నారు.కానీ ,పరిస్థితి మారిపోయింది. గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత పాత్రలకు నో చెప్పడంతో అనుపమకు అవకాశాలు సన్నగిల్లాయి.ఇటీవల ఆమె చేసిన రాక్షసుడు సినిమా పర్వలేదనిపించిన ఆ సినిమా వలన పక్కింటి అమ్మాయికి ఒరిగిందేం లేదు. దాంతో అనుపమ పరమేశ్వరన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ఆమె తమిళ,మలయాళ సినిమాలే చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.